ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం 

 చీఫ్ ఇంజనీర్ కామేష్

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం 

దమ్మాయిగూడ, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)

కీసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ కామేష్ తెలిపారు. సిఎండి ఆదేశాల మేరకు గురువారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చేర్యాల గణేష్ టౌన్షిప్, ఎస్సీ కాలనీలలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ కామేష్ స్వయంగా అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించి, స్థానిక విద్యుత్ సమస్యలను పరిశీలించారు. చెట్ల కొమ్మలు తొలగింపు, డిటిఆర్ నిర్వహణ, యార్డ్ క్లీనింగ్, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ఏర్పడే విద్యుత్ అంతరాయాల వంటి అంశాలపై తక్షణ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ డిఈ టి.లింగయ్య, ఏడిఈ సిహెచ్.నందకిషోర్, ఏఈ మురళీకృష్ణ, సెక్షన్ సిబ్బంది శ్రీనివాసులు, నరసింహ, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .