గోరక్షక కార్యకర్తపై కాల్పుల కేసులో వేగవంతమైన విచారణ

రాచకొండ పోలీసులకు అభినందనలు గోరక్షక కార్యకర్తలు

గోరక్షక కార్యకర్తపై కాల్పుల కేసులో వేగవంతమైన విచారణ

 ఘట్కేసర్‌, అక్టోబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఘట్కేసర్‌లో గోరక్షక కార్యకర్త బిడ్ల ప్రశాంత్‌పై జరిగిన కాల్పుల ఘటనలో రాచకొండ పోలీసులు వేగంగా స్పందించి కేవలం 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల చురుకైన చర్యలకు గోరక్షక్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.సోమవారం రోజు గోరక్షక్ సభ్యులు రావుల శ్రీకాంత్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా వారు పోలీస్ అధికారులకు పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా రావుల శ్రీకాంత్ మాట్లాడుతూ, “గోరక్షక కార్యకర్తపై జరిగిన దాడి సంఘటనతో మేమంతా ఆందోళన చెందాము. కానీ రాచకొండ పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయడం ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చూపిన తక్షణ స్పందన అభినందనీయం” అని అన్నారు.రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, “ఎవరి మీదైనా దాడి జరగడం అనేది చట్టవిరుద్ధం. ఇలాంటి సంఘటనల్లో పాలుపంచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని” అన్నారు.ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులతో పాటు గోరక్షక్ సంస్థ సభ్యులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .