నాగారం మద్యం దుకాణం పై రగడ
భాగస్వామ్యం వివాదం, భద్రతా ఆందోళనలతో ఉద్రిక్తత
నాగారం, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
నాగారం మున్సిపాలిటీ పరిధిలో నూతన మద్యం దుకాణం ఏర్పాటు చుట్టూ వివాదం రేగింది. ప్రభుత్వ లక్కీ డ్రాలో షాప్ నంబర్ 1 పవన్ రెడ్డి, జీవన్ రెడ్డికి రావడంతో వారు దుకాణం ప్రారంభానికి సిద్ధమ వుతున్నారు.ఈ క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి స్థలం లీజుకు ఇవ్వాలని కోరగా, ఆయన భాగస్వామ్యం కోరినట్టు సమాచారం. దీనికి పవన్, జీవన్ రెడ్డి నిరాకరించడంతో చంద్రారెడ్డి వ్యతిరేక ధోరణి అవలంబించారని వారు ఆరోపించారు.ఈ నేపథ్యంలో సత్యనారాయణ కాలనీ వాసులను ఉసిగొల్పి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పవన్, జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ గార్డులను నియమించడం, మెయిన్ రోడ్డులోని సీసీ కెమెరాలను కీసర పోలీస్ స్టేషన్‌కి అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.ఇదే కాలనీలో రోడ్ నెంబర్ 12లో పాత మద్యం దుకాణం చంద్రారెడ్డి స్థలంలోనే నడుస్తోందని, దాని వెనుక చైతన్య ప్రైవేట్ పాఠశాల ఉన్నప్పటికీ అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదని వారు గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం వ్యతిరేకత చూపడం చంద్రారెడ్డి కుట్రపూరిత చర్య అని పవన్, జీవన్ రెడ్డి విమర్శించారు.అయితే మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ“
సత్యనారాయణ కాలనీలో 400కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. మహిళలు, పిల్లల భద్రత దృష్ట్యా నివాస ప్రాంతంలో మద్యం దుకాణం సరికాదు. అందుకే కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు” అని తెలిపారు.


Comments