విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలి
చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణలో కీసర ఎంఈఓ జమదగ్ని
కీసర, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు)
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే దిశగా పాఠశాల స్థాయిలో విభిన్న కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని కీసర మండల విద్యా అధికారి జమదగ్ని అన్నారు. కీసర మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన “చెకుముకి సైన్స్ సంబరాలు – 2025” గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంచడంలో చెకుముకి వేదిక ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఈఓ జమదగ్ని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గోడపత్రికలు, సైన్స్ ఫెయిర్‌లు, ప్రతిభా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చన్నారు.
జెవివి నాయకులు శేషగిరిరావు మాట్లాడుతూ – చెకుముకి పరీక్షల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 7న, మండల స్థాయిలో నవంబర్ 21న నాగారం ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.


Comments