ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం దేశవ్యాప్త ఉద్యమం

ఎన్‌పీఆర్‌డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్

ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం దేశవ్యాప్త ఉద్యమం

ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

వికలాంగులకు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ తెలిపారు.
కమలానగర్‌లోని ఎన్వీ భాస్కర్‌రావు భవన్‌లో “వికలాంగుల విద్యా–ఉపాధి, చట్టాల అమలు అనుభవాలు” అనే అంశంపై ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ అధ్యక్షతన జరిగింది. మురళీధరన్ మాట్లాడుతూ, “ఒకే దేశం–ఒకే ఎన్నికల గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఒకే పెన్షన్ కోసం ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు. దేశవ్యాప్తంగా వికలాంగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలి,” అని ప్రశ్నించారు.కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో వికలాంగులకు చట్టబద్ధంగా ఉన్న 25 శాతం అదనపు నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ప్రభుత్వ–ప్రయివేట్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్లను నియమించాలని, విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. “2012 నుండి కేంద్రం కేవలం రూ.300 పెన్షన్‌ మాత్రమే ఇస్తోంది. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.5,000కి పెంచాలి,” అని ఆయన కోరారు.కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, సుగమ్య భారత్ అభియాన్ అమలులో నిర్లక్ష్యాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య మాట్లాడుతూ, “వికలాంగుల కార్పొరేషన్ బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు 2023లో విడుదల చేసిన జీవో 34ను వెంటనే అమలు చేయాలి,” అని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా పెన్షన్ పెంపు జరగకపోవడం విచారకరమని ఆయన అన్నారు.“పెన్షన్ పెంచకపోగా, వాటిని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు చట్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర అధ్యక్షురాలు టి. వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ టీచర్ల నియామకం అత్యవసరమని పేర్కొన్నారు.ప్రత్యేకఅవసరాలున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు IMG-20251025-WA0026.ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, ఉపాధ్యక్షులు యశోద, కాషప్ప, ఉపేందర్, అరిఫా, మధుబాబు, సహాయ కార్యదర్శులు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమోహన్, ప్రకాష్, దుర్గ, కవిత, భాగ్యలక్ష్మి, బాలయ్య, నర్సిములు, ప్రభుస్వామి, లలిత, షాయిన్ బేగం, రమేష్, మల్లేష్, యాదయ్య, నగేష్, వెంకన్న, రాజు, లక్ష్మీపతి, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .