ఆన్‌లైన్ వ్యభిచారం నుండి ఉగాండా మహిళల రక్షణ ఒకరు అరెస్ట్
ప్రధాన నిందితుడు పరారీలో
రాచకొండ ఎహెచ్‌టియు పోలీసుల స్ఫూర్తిదాయక ఆపరేషన్
నాచారం, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)
రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎహెచ్‌టియు పోలీసులు నాచారం స్థానిక పోలీసులతో కలిసి గురువారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి, ఆన్‌లైన్ లోకాంటో యాప్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను బట్టబయలు చేశారు. ఈ దాడిలో ఉగాండా దేశానికి చెందిన ఇద్దరు విదేశీ జాతీయ మహిళలను రక్షించగా, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు భవానీనగర్ ప్రాంతంలోని ఓ గృహంపై దాడి చేయగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు తేలింది.నిందితుల వివరాలు:డేనియల్ – నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. సంపత్ కుమార్ మోహితే (59), దివంగత నాగేందర్ రావు కుమారుడు, ప్రభుత్వ ఉద్యోగి (పోస్టల్), నివాసం: శ్రీ నిలయ టౌన్‌షిప్, బడంగ్‌పేట్, సరూర్‌నగర్ మండలం – కస్టమర్‌గా వ్యవహరించాడు.స్వాధీనం చేసుకున్న వస్తువులు:రూ. 8,050/- నగదు.రూ. 500/- మరియు రూ. 1,000/- జి-పే యూపీఐ చెల్లింపులు .6 మొబైల్ ఫోన్లు,2 కండోమ్‌లు
దర్యాప్తులో డేనియల్ లోకాంటో యాప్ ద్వారా ఆన్‌లైన్ వ్యభిచార గృహాన్ని నడుపుతూ, బాధిత మహిళల ఫోటోలను ఆన్‌లైన్‌లో పంచి కస్టమర్లను ఆకర్షించి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఎల్.బి.నగర్–మహేశ్వరం ఎస్ఓటి ఏడిసిపి ఎం.డి. షకీర్ హుస్సేన్, రాచకొండ ఎహెచ్‌టియు ఇన్‌స్పెక్టర్ ఎస్. దేవేందర్, నాచారం ఇన్‌స్పెక్టర్ కె. ధనుంజయ మరియు సిబ్బంది పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Comments