రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
Views: 3
On
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్ ఆధ్వర్యంలో కమిషనరేట్ సిబ్బంది అందరూ కలిసి వందేమాతర గీతాన్ని గానం చేశారు.ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజలను ఒక తాటిపైకి తెచ్చి దేశభక్తి జ్వాలను రగిలించిందని తెలిపారు. ఈ గీతం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిందని, దేశ ప్రజల్లో దేశప్రేమను నింపిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments