నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు
Views: 2
On
వేలేరు, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలకేంద్రంలో మరియు పీచర గ్రామంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు ప్రస్తుతం నిరూపయోగంగా మారిపోయాయి. వీటి సంరక్షణ చూసుకునేవారు లేకపోవడంతో టాయిలెట్లు చెత్త చేదారంతో నిండి, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, టాయిలెట్ల వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో వాటిని ఉపయోగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అలాగే టాయిలెట్లు పూర్తిగా నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలేశారని పేర్కొన్నారు.ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ, “ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి టాయిలెట్లను మరమ్మత్తు చేసి, నీటి సౌకర్యం కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments