జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
జూబ్లీహిల్స్ లో ఎంపి కడియం కావ్య ప్రచారం
హైదరాబాద్,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్, బంజారా బస్తిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆత్మీయంగా పలకరించిన ఆమె స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
ఈ నెల 11న జరగనున్న ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.
విపక్షాలు చెబుతున్న అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా, స్థానిక సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై, వారి కోసం కృషి చేసే నాయకత్వం
కాంగ్రెస్ పార్టీదేనని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.


Comments