నేషనల్ ఎడ్యుకేటర్ అవార్డ్ అందుకున్న తక్షశిల ఉపాధ్యాయులు
తార్నాక, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు)
తార్నాకలోని ప్రముఖ విద్యాసంస్థ తక్షశిల పబ్లిక్ స్కూల్ కు చెందిన పలువురు ఉపాధ్యాయులు విద్యారంగంలో చేసిన అద్భుత సేవలకు గాను డా. రాధాకృష్ణన్ టీచర్స్ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేటర్ అవార్డ్ అందుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఉపాధ్యాయులు పూజా సింగ్, శిరీష, శిల్పా సంగ్, రేఖ. వీరు బోధనలో సృజనాత్మక విధానాలను ప్రవేశపెట్టి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతా భావం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. అజిత్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ“ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, సమాజ నిర్మాణానికి పునాది వేస్తారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, మానవతా విలువలు పెంపొందించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. తక్షశిల ఉపాధ్యాయులు చూపిన అంకితభావం అందరికీ ఆదర్శం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భోలా సింగ్, తెలంగాణ ఇంచార్జ్ బబితా చక్కిలం, డా. సురభి దత్, డా. రాజీవ్ సింగ్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.సంస్థ తరఫున ఉపాధ్యాయులకు పుష్పగుచ్ఛాలు, స్మారక ఫ
లకాలు అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.


Comments