మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్
Views: 6
On
పెద్దమందడి,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన చిట్టి, కొము కిష్టయ్య (మాదిగ) అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబాలు కావడంతో మృతుల కుటుంబాలకు బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.
చిట్టి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని, అలాగే అనారోగ్యంతో కొద్దిరోజులుగా పోరాడి నిన్న జిలకర నాగన్న కుమార్తె మరణించిన విషాద సంఘటన పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సురేష్ కుమార్ స్వయంగా ఆ కుటుంబాలను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. దశదినకర్మ ఖర్చుల కోసం రెండు కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments