కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు
కాప్రా, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్‌టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ తెలిపారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం అత్యల్ప అద్దె ధరల్లో బస్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు భక్తుల సేవలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పంచారామాలు, శ్రీశైలము, వేములవాడ, అరుణాచలం, కొమరవెల్లి మల్లన్న వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భక్తుల కోరిక మేరకు బస్సులు అద్దెకు ఇవ్వబడతాయని చెప్పారు.
అదేవిధంగా, కార్తీక మాసం సందర్భంగా కీసరగుట్టకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.


Comments