మల్లన్నగండి రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం

మల్లన్నగండి రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం

స్టేషన్‌ఘనపూర్,నవంబర్07 (తెలంగాణ ముచ్చట్లు):

చిల్పూర్ మండలం మల్లన్నగండి రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వందశాతం సబ్సిడీతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముదిరాజ్ సమాజాన్ని ఆర్థికంగా బలపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రాజకీయాలు పక్కనబెట్టి అందరూ ఏకతాటిపై ఉండి ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు.

స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గం మత్స్య సంపదలో ముందంజలో ఉందని, 320 చెరువులు, 7 రిజర్వాయర్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులలో చేప పిల్లల పెంపకాన్ని విస్తృతంగా చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.గండిరామారం రిజర్వాయర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్న శ్రీహరి తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1.60 కోట్ల వ్యయంతో గండిరామారం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని, ఆ రిజర్వాయర్ కింద రైతులు ప్రస్తుతం రెండు పంటలు పండించి ఆర్థికంగా బలపడుతున్నారని పేర్కొన్నారు.
అలాగే మల్లన్నగండి రిజర్వాయర్‌కు రెండు వైపులా 32.60 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. “మాటలు చెప్పేవారికి కాదు, అభివృద్ధి చేసి చూపించే నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి,” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.IMG-20251107-WA0033

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం