బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందే.   

బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందే.   

బీసీ రిజర్వేషన్లపై పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం.

 హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసి ఆధ్వర్యంలో మౌన దీక్ష.                         

ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్.

హాసన్ పర్తి, నవంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):

జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా,ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హన్మకొండలో అంబేద్కర్ జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద  విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని  మండిపడ్డారు.జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను,ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ,రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే,మద్దతునిచ్చిన బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ,బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని,లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి బిజెపికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు.తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు వేణుగోపాల్ గౌడ్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు,కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంనికి లంబాడి హక్కుల పోరాట సమతి,ఎమ్మార్పీఎస్ మద్దత్తు తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాడి మల్లయ్య యాదవ్,బోనగాని యాదగిరి గౌడ్,బీసీ జేఏసీ మహిళా నాయకురాలు తమ్మేలా శోభరాణి,మాదం పద్మజదేవి,తెల్ల సుగుణ,హైమావతి,కిషోర్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు బచ్చు ఆనందం,దాడి రమేష్ యాదవ్,గొట్టే మహేందర్,డా. ఒడితల రాము, తంగళ్లపెల్లి రమేష్,పంజల మధు గౌడ్,జ్ఞానేశ్వర్, రజనీకాంత్,పొన్నం సంపత్,చాగంటి రమేష్  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .