విద్యుత్ షాక్‌లో గేదెలు మృతి

రైతులను పరామర్శించిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

విద్యుత్ షాక్‌లో గేదెలు మృతి

వనపర్తి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్ కారణంగా ఎనిమిది గేదెలు మృతి చెందడం జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఏఐపిసి నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

డాక్టర్ ఆదిత్య రెడ్డి వెంటనే రైతులు మద్దుల కొల్ల మల్లయ్య మరియు భాస్కర్ రెడ్డిను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రైతుల వివరాల ప్రకారం, సుమారు 25 గేదెలను నదీ పునర్వాసన కోసం మోసుకుంటూ వెళ్తుండగా, గేదెలు చెరువులో ఈతపడుతూ వస్తుండగా 17 గేదెలు ఒడ్డుకు చేరుకున్నాయి, అయితే 8 గేదెలు విద్యుత్ షాక్ కారణంగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

డాక్టర్ ఆదిత్య రెడ్డి, మండల వెటర్నరీ డాక్టర్లు, ఎంఆర్ఓ, విద్యుత్ ఉన్నతాధికారులతో సంప్రదించి, ప్రత్యేక నిధుల ద్వారా పశువులకు మరియు రైతులకు సహాయం అందించే సూచనలు చేశారు. బాధిత రైతులకు ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఆపత్కాల పరిస్థితుల్లో సాయం చేస్తుందని మనోధైర్యం కల్పించారుWhatsApp Image 2025-10-24 at 6.34.36 PM.

కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, గోపాల్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, వనపర్తి జిల్లా ఏఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, వనపర్తి మండల ఎన్ ఎస్ యు ఐ  అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, ఎంట్ల రవి, పర్వతాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .