వందేమాతర గీతానికి 150 ఏళ్లు – మద్దిగట్ల పాఠశాలలో ఘనంగా వేడుకలు
పెద్దమందడి,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్లలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం — గద్వాల కృష్ణ, ఏ. భగవంతు, వి. వాణి ప్రభ, పుల్లయ్య, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, చిన్నారెడ్డి — అలాగే ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు మాట్లాడుతూ..875 నవంబర్ 7న వందేమాతర గీతానికి అంకురార్పణ జరిగింది. గౌరవనీయులు బంకిమ్ చంద్ర చటర్జీ తన ఆనందమఠ నవల ద్వారా ఈ గీతానికి విశేష ప్రాచుర్యం తీసుకువచ్చారు అని అన్నారు.
అలాగే ఈ గీతం స్వాతంత్ర్య సమరయోధులలో దేశభక్తి జ్వాలను రగిలించి, ఐకమత్యం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్, సరోజినీ నాయుడు తదితర నాయకులు ఈ గీతానికి విశేష ప్రాచుర్యం కల్పించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలతో వాతావరణాన్ని రక్తికట్టించారు.


Comments