టీడబ్ల్యూజేఏ హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నిక.
అధ్యక్షుడిగా భూక్యా సిద్దు నాయక్ ఏకగ్రీవం.
హాసన్ పర్తి,నవంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు):
ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీడబ్ల్యూజేఏ) హనుమకొండ జిల్లా నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిత కాకతీయ హోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా భూక్యా సిద్దు నాయక్ (టుడే ఫ్రీడమ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ దేవేందర్ నాయక్ (సాక్షి), కోశాధికారిగా భూక్యా శ్రావణ్ కుమార్ (పబ్లిక్ న్యూస్), ఉపాధ్యక్షుడిగా నూనావత్ శ్రీనివాస్ నాయక్ (పబ్లిక్ న్యూస్), సహాయ కార్యదర్శిగా బాదావత్ ప్రదీప్ నాయక్ను ఎన్నుకున్నారు. అలాగే ఆంగోత్ సుధాకర్, బానోత్ అనిల్ నాయక్, లకావత్ సుమన్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకట్ నాయక్ మాట్లాడుతూ, “టీడబ్ల్యూజేఏ సంఘం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.ఏజెన్సీ,మైదాన ప్రాంతాల గిరిజన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,వారికి ఇళ్ల స్థలాలు,అక్రిడిటేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. గిరిజన జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే ప్రయత్నం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ గుగులోత్ కల్యాణి,రాష్ట్ర నాయకుడు విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments