జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం
స్టేషన్ ఘనపూర్, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్టీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఘనంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ (భీమ్ దేవరపల్లి జై బాపు – జై భీం – జై సంవిధాన్ ఇంచార్జ్) ప్రధానంగా పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు చిదిరాల స్వరూప, మార్కెట్ వైస్ చైర్మన్ స్రవంతి రెడ్డి, ముత్తయ్య, రవీంద్రాచారి, లక్మన్, పొన్న శ్రీకాంత్, సింగారపు సంతోష్, బాలస్వామి, నాగలక్ష్మి, సుబ్బలక్ష్మి, శ్రీలత, స్నేహాలత, స్వప్న, అన్నపూర్ణ, కళావతి తదితరులు పాల్గొన్నారు.
ప్రచారం సందర్భంగా ప్రజలలో ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.


Comments