అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మల్లాపూర్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సెవెరేజ్ బోర్డు నిధులతో ఈస్ట్ అన్నపూర్ణ కాలనీలో రూ.8 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు, రూ.4.10 లక్షల వ్యయంతో తాగునీటి పైపులైన్ పనులు చేపట్టనున్నారు. అలాగే న్యూ భవానీ నగర్ కాలనీలో రూ.20.50 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, జలమండలి మేనేజర్ సిరాజుద్దీన్, కాలనీ వాసులు దుల్మిట్ట దయాకర్ రెడ్డి, బాను చందర్ రెడ్డి, కటర్ల శేఖర్, ధర్మారెడ్డి, మెయిన్ పాషా, శ్రీనివాస్ రావు, రాఘవచారి, ఇస్మాయిల్, ప్రదీప్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, తండా వాసుగౌడ్, కుంటి కృష్ణ, తిగుళ్ల శ్రీనివాస్ గౌడ్, అల్లాడి కృష్ణ యాదవ్, ఉస్మాన్, శ్రీశైలం, మహేందర్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.IMG-20251025-WA0019

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం