సాంకేతికంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి గీతాంజలి కాలేజీతో ఎంఓయు ఒప్పందం

సీఐఏ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

సాంకేతికంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి గీతాంజలి కాలేజీతో ఎంఓయు ఒప్పందం

చర్లపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఇంజనీరింగ్ విద్యా సంస్థల సహకారంతో పారిశ్రామిక రంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం (సిఐఏ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది.
సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఐఏ అధ్యక్షుడు డి. శ్రీనివాసరెడ్డి, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ జి.ఆర్. రవీందర్ రెడ్డి ఎంఓయు పై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా చర్లపల్లి పారిశ్రామికవాడలోని పరిశ్రమలకు కావలసిన సాంకేతిక నైపుణ్యంతో కూడిన మ్యాన్‌పవర్‌ను గీతాంజలి కాలేజీ అందించనుంది.ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ — పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం, పరిశ్రమలకు అవసరమైన మ్యాన్‌పవర్ లభించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి పరిశ్రమలకు అవసరమైన సాంకేతికత, మ్యాన్‌పవర్ వివరాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విద్యార్థులు ఈ వెబ్‌సైట్ ద్వారా పరిశ్రమలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని వివరించారు.ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ — ఈ ఎంఓయు ద్వారా ఇరువురికీ ప్రయోజనం కలుగుతుందని, రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక మండలాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు పారిశ్రామిక అనుభవాన్ని పొందుతూ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐఏ సలహాదారు జె. నరేందర్ రెడ్డి, గీతాంజలి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఆర్. హరిచందర్ రెడ్డి, డైరెక్టర్ ఎస్. ఉదయ్ కుమార్, సీఐఏ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, గంగాధర్ బాబు, రాజు, వీరమోహన్, అవినాష్, అనంత్, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం