వేంసూరులో కొత్త ఎంపీడీఓగా కావ్య బాధ్యతలు స్వీకరణ.
సిబ్బంది ఆత్మీయ స్వాగతం.
Views: 60
On
వేంసూరు, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి నూతన ఎంపీడీఓగా డి.కావ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై తొలిసారి ఇక్కడే పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన పరిమి రాజారావు అధికారికంగా బాధ్యతలను కావ్యకు అందజేశారు.
కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది కొత్త ఎంపీడీఓని ఆత్మీయంగా స్వాగతించారు. కార్యాలయ మర్యాదలతో పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువ కప్పి, మిఠాయి తినిపించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ కావ్య మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పరిపాలనను చేపడతా. గ్రామీణాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి అని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments