జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం
నవీన్ యాదవ్ విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలి
– తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి
జూబ్లీహిల్స్,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డివిజన్ 209, 210, 211 బూత్‌లలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో రాష్ట్ర ప్రభుత్వం బలపడుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని తెలిపారు. “జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ప్రజాభివృద్ధికి అండగా నిలుద్దాం,” అని పిలుపునిచ్చారు.
యువ నాయకుడైన నవీన్ యాదవ్ ప్రజల సమస్యలకు స్పందించే వ్యక్తి అని, ఆయన్ని గెలిపించడం ద్వారా స్థానిక ప్రజలకు మేలుచేసే అవకాశముందని రాఘవ రెడ్డి పేర్కొన్నారు.“కాంగ్రెస్ పార్టీతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం. పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేసి నవీన్ యాదవ్ గెలుపు దిశగా కదిలాలి,” అని జంగా రాఘవ రెడ్డి పిలుపునిచ్చారు.


Comments