సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
-“సు రాజ్యానికి స్ఫూర్తి మంత్రం వాడ వాడలా వందేమాతరం”
– పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు
ఎల్కతుర్తి, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధుల గుండెల్లో జ్వాల రేపిన “వందేమాతరం” గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఎల్కతుర్తి మండలంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వందేమాతరం గేయాన్ని ఆలపించి, దేశభక్తి గీతాలు, నృత్యాలు, వక్తృత్వ పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు.
పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ
బంకిమ్ చంద్ర చట్టర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మగా నిలిచింది.
ఇది కేవలం గేయం కాదు, మన సురాజ్యానికి స్ఫూర్తి మంత్రం.
స్వాతంత్ర్య సమరంలో కోట్లాది భారతీయుల గుండెల్లో ధైర్యం నింపిన ఈ గీతం ప్రతి విద్యార్థి హృదయంలో దేశభక్తిని నింపాలి,” అన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, వైస్ ప్రిన్సిపల్ మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రే తిరుపతి, ఉపాధ్యాయులు ఆశా బేగం, సురేష్, రమేష్, సరిత, లావణ్య, మమతా, కవిత, శ్వేత, కావ్య, అనుష, స్వప్న, రమ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Comments