జపాన్ కరాటే అసోసియేషన్ పోటీల్లో సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూలు విద్యార్థుల ప్రతిభ
పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు
ఎల్కతుర్తి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల నిర్వహించిన జపాన్ కరాటే అసోసియేషన్ ఫోటోకాన్ బెల్ట్ పరీక్షల్లో సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు జి. అక్షర బ్లూ బెల్ట్, అలాగే ఎం. వర్ణిక్ ఆరెంజ్ బెల్ట్ సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, “విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో చురుకుగా పాల్గొనడం అవసరం. రానున్న రోజుల్లో ఆత్మరక్షణలో కరాటే కీలక పాత్ర పోషిస్తుంది” అని పేర్కొన్నారు.
ఇదే విద్యార్థులు త్వరలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరగనున్న నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు.
కరాటే మాస్టర్ కవ్వంపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు నిబద్ధతతో శిక్షణ ఇచ్చి వారి ప్రతిభను వెలికితీసినందుకు కరస్పాండెంట్ కార్తీక్ రావు ఆయనను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్, హెడ్‌మాస్టర్ మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, ఆశా బేగం, సురేష్, మమత, కవిత, శ్వేత, అనుష, కావ్య తదితరులు పాల్గొన్నారు.


Comments