మహిళలకు అండగా  షీ టీమ్స్  రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు

15 రోజుల్లో 171 వేదింపుల నివారణ

మహిళలకు అండగా  షీ టీమ్స్  రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు

హైదరాబాద్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు (ఐపీఎస్) మాట్లాడుతూ బాలికలను మహిళలను వేధించే మగపురుషు లను షీ టీమ్స్ వదలదన్నారు. వారు బస్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, స్కూల్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్లలో పాల్గొని, నిందితులను సాక్ష్యాలతో పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.ప్రధాన చర్యలు:
మైనర్ బాలికను వేధించిన మేనత్త భర్త అరెస్ట్.తప్పుడు ఆరోపణలు వేసి మహిళను వేధించిన నిందితులు అదుపులోకి తీసుకోబడ్డారు.ప్రేమ మోసం చేసి శారీరకంగా వేధించిన వ్యక్తి అరెస్ట్.బస్ స్టాండ్‌లో న్యూసెన్స్ చేస్తున్న యువకుడు అదుపులోకి తీసుకోబడిన ఘటన.
అవగాహన కార్యక్రమాలు:
ఈ నెల 1–15 తేదీలలో 79 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 13,501 మందికి మహిళా హక్కులు, చట్టాలు, జాగ్రత్తలపై వివరాలు అందజేయడం జరిగింది.మెట్రో-రైల్ డెకాయ్ ఆపరేషన్లు:మహిళా కాంపార్ట్‌మెంట్‌ లో ప్రయాణిస్తున్న 7 పురుషులను పట్టుకుని, మెట్రో స్టేషన్ అధికారుల ద్వారా ఫైన్ విధించబడింది.
మహిళలు ఫిర్యాదు చేయడానికి నంబర్లు:రాచకొండ వాట్సాప్: 8712662111,బోనగిరి: 8712662598, చౌటుప్పల్: 8712662599, ఇబ్రహీం పట్టణం: 8712662600, కుషాయిగూడ: 8712662601,ఎల్‌బి నగర్: 8712662602, మహేశ్వరం: 8712665299, మల్కాజిగిరి: 8712662603,వనస్థలిపురం:8712662604, యాదగిరి: 8712665300.సీపీ  సూచన:
మహిళలు, యువతులు వేదింపులకు గురైనప్పుడు భయపడకుండా షీ టీమ్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో: డీ.సి.పి ,
టి. ఉషారాణి, ఏసిపి పల్లె వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్జి. అంజయ్య, అడ్మిన్ ఎస్‌ఐ రాజు మరియు షీ టీమ్స్ సిబ్బంది. IMG-20251025-WA0049

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం