మానవ హక్కుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత.
హ్యూమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనిల్ కాందారి నియామకం.
హాసన్ పర్తి,అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మానవ హక్కుల పరిరక్షణ,అవినీతి నిర్మూలన దిశగా విశేష కృషి చేస్తున్న బిజీ హ్యూమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనిల్ కాందారి నియమితులయ్యారు.
ఈ నియామకాన్ని సంస్థ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ బయ్యపునేని వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవా రంగంలో అనిల్ కాందారి కృషి ప్రశంసనీయం. పేదల హక్కుల పరిరక్షణ,ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి నిరోధం వంటి అంశాల్లో ఆయన చూపిన చొరవ ఆదర్శనీయం.ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత,ప్రజలకు న్యాయం,మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా సమర్థంగా నాయకత్వం వహిస్తారని మా విశ్వాసం అని తెలిపారు.అదేవిధంగా అనిల్ కాందారి నియామకంతో సంస్థ కార్యకలాపాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు విస్తరించనున్నట్లు తెలిపారు.అవినీతి వ్యతిరేక పోరాటానికి యువతను,సామాజిక సేవకులను కలుపుకుంటూ కొత్త ఆలోచనలతో సంస్థ ముందుకు సాగనుందని వివరించారు.ఈ సందర్భంగా అనిల్ కాందారి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కేవలం ఒక ఉద్యమం కాదు,ప్రతి పౌరుడి బాధ్యత.ప్రజలతో నేరుగా కలసి వారి సమస్యలు వినిపించి,న్యాయం సాధించే దిశగా కృషి చేస్తానని అవినీతి నిర్మూలన, బాధితులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతాను అని తెలిపారు. సమాజంలోని నిరుపేదలు,కార్మికులు,మహిళలు, పిల్లలు,వృద్ధుల హక్కుల రక్షణలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.


Comments