పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చాలి.
ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రస్తుతం పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయం ములకలపల్లి పరిధికి చెందినది అయినప్పటికీ, అది అశ్వారావుపేటలో నిర్వహించబడుతోంది. ఈ కారణంగా ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ములకలపల్లి నుండి అశ్వారావుపేట వరకు 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండటం చేత ప్రజలకు, అధికారులకు ప్రయాణ భారంగా మారింది. ఫలితంగా పనులు ఆలస్యమవుతున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు పలుమార్లు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో, ములకలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి సులభంగా లభ్యమవుతున్నందున, అశ్వారావుపేటలో ఉన్న పంచాయతీరాజ్ ఉపవిభాగ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చవలసిందిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం హైదరాబాద్‌లో స్త్రీ-శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రివర్యులు ధనసరి సీతక్క (అనసూయ) ను కలిసారు.
అవసరమైన వసతుల కల్పన కోసం గిరిజన ఉపనిధుల ద్వారా సహకారం అందించాలంటూ ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు.


Comments