జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి బి.ఎల్.ఓ సమస్యలు పరిష్కరించాలి
వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్
పెద్దమందడి,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి, బి.ఎల్.ఓల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి పిలుపునిచ్చింది. పెద్దమందడి మండల బి.ఎల్.ఓలు తమ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన వినతి పత్రం మేరకు అఖిలపక్ష ఐక్యవేదిక ప్రతినిధులు ఎమ్మార్వో ను కలసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈరోజు కొందరు బి.ఎల్.ఓల విజ్ఞప్తి మేరకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ పెద్దమందడి మండల ఎమ్మార్వో కార్యాలయంలో జరుగుతున్న బి.ఎల్.ఓ సమావేశానికి హాజరై మాట్లాడుతూ.. బి.ఎల్.ఓలకు రావలసిన వేతనాలు వెంటనే చెల్లించాలి. అదనపు పనులు చేయిస్తూ, వారికి రావలసిన డబ్బులు ఇవ్వకపోవడం సరైంది కాదు. మహిళలతో శ్రమదోపిడీ చేయిస్తూ ఇతర పనులు చేయించడం న్యాయం కాదు. కలెక్టర్ గారి ఉత్తర్వుల పేరుతో ఇతర పనులు చేయిస్తూనే చెల్లింపులు నిలిపివేయడం తక్షణం ఆపాలి అని డిమాండ్ చేశారు.
బి.ఎల్.ఓల సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, నాగవరం వెంకటేశ్వర్లు, పెద్దమందడి బి.ఎల్.ఓలు, అంగన్వాడీ టీచర్లు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కొత్త గొల్ల శంకర్, రాజనగరం రవి, శివకుమార్, ఎన్. సురేష్, ఏ. ఉదయ్, జి. సురేష్, ఎన్. కురుమూర్తి, టి. మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Comments