సమాజాన్ని కలచివేసిన బస్సు దుర్ఘటన

చిన్న తప్పు పెద్ద విషాదాన్ని మిగిలించింది

సమాజాన్ని కలచివేసిన బస్సు దుర్ఘటన

కీసర, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

కర్నూల్‌ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం యావత్‌ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఎన్‌బిఎంఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్‌ రాథోడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కీసర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ — ఈ దుర్ఘటనలో నిరపరాధులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు.“చిన్న తప్పులు, క్షణిక నిర్లక్ష్యం ఎంతటి పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి మనకు గుర్తు చేసింది,” అని రవి రాజ్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్‌ జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్‌ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. వాహనం నడిపే ప్రతీ వ్యక్తి ట్రాఫిక్‌ నియమాలను కేవలం చట్టబద్ధత కోసమే కాకుండా మానవతా బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలసి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.“మన జాగ్రత్తే మన ప్రాణాలకు రక్షణ” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరు గుండెల్లో ముద్రించు కోవాలని రవి రాజ్‌ రాథోడ్‌ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం