మహిళా హక్కుల కై ఐద్వా మహాసభ.

మహిళా హక్కుల కై ఐద్వా మహాసభ.

సత్తుపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లిలో ఐద్వా డివిజన్ మహాసభ సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల భవనం నుండి సెంటర్ మీదుగా కళాభారతి వరకు మహిళలు మహా ర్యాలీగా ముందుకు నడిచారు. కొండపల్లి దుర్గాదేవి నగర్‌లో ఎన్ హైమావతి జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులు మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ, కొండపల్లి దుర్గాదేవి చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు.

సభకు పాకాల పాటి ఝాన్సీ, జాజిరి జ్యోతి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే శక్తిని తమలో పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా పోరాటాల ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామని, ప్రతి మహిళకు రెండు లక్షల డ్వాక్రా రుణం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాలు లేని 33 లక్షల మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.

విద్య, వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో అందరికీ అందుబాటులోకి తేవాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు. మహిళలపై హింసకు దారితీసే మధ్యాన్ని నిషేధించాలని అభిప్రాయపడ్డారు. మైక్రో ఫైనాన్స్ వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేరళలో అమలులో ఉన్న కుటుంబశ్రీ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని సూచించారు. మహిళా హక్కుల సాధన కోసం మహిళలు ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

జిల్లా నాయకులు మాచర్ల భారతి, బండి పద్మ, మెరుగు రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలలో ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతావి ఇంకా అమల్లోకి రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మనువాదాన్ని ముందుకు నెట్టుతూ కుల–మతాల మధ్య విభేదాలు రేకెత్తించి మహిళా అభివృద్ధిని అడ్డుకుంటోందని అభిప్రాయపడ్డారుWhatsApp Image 2025-10-27 at 6.26.47 PM.

ఈ సందర్భంగా 21 మందితో కూడిన కొత్త డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ సునీత, శిలం కరుణ, గుడిమెట్ల రజిత, తన్నీరు కృష్ణవేణి, చెరుకు రత్నకుమారి, మిట్టపల్లి నాగమణి, రాణి రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
-మన స్వాతంత్ర్య సమరయోధులలో  ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం  -ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు): స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...
సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో ఘనంగా “వందేమాతరం 150 ఏళ్ల” సంబరాలు
నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే -నగరాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
ఈసీఐఎల్ మెగా జూనియర్ కాలేజీలో సామూహిక వందేమాతరం గానం
రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం