కార్తీక మాసం సందర్బంగా  శ్రీ నందీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి

కార్తీక మాసం సందర్బంగా  శ్రీ నందీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

మల్లాపూర్, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

కార్తీక మాసం సందర్భంగా మల్లాపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ నందీశ్వరాలయంలో సోమవారం భక్తిమయ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఆలయ వేదిక వద్ద ప్రత్యేకఅభిషేకాలు, పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.WhatsApp Image 2025-11-17 at 7.44.55 PMఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం అందజేస్తూ కార్పొరేటర్ మాట్లాడుతూ—“కార్తీక మాసంలో ఆలయాలలో జరిగే సేవా కార్యక్రమాలు ప్రజల్లో మంచి శాంతి, సామరస్యం పెంపొందిస్తాయి. మల్లాపూర్ శ్రీ నందీశ్వరాలయం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పి.జి. సుదర్శన్, రాజేష్, శ్రీహరి గౌడ్, మహేందర్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!