కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి స్పష్టమైంది.
తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్,మోరపాక నాగయ్య.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి స్పష్టమైందని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్,మోరపాక నాగయ్య అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్పార్టీతోనే సాధ్యం అవుతుందని మరోసారి రుజువైందన్నారు.
బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ, రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని,ఇలాంటి తీర్పు ద్వారా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తామని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీగా జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను నిలబెట్టడం ద్వారా బీసీలపై నిజమైన కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మరోసారి రుజువైందని, ఎమ్మెల్యే గా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో, సెంటిమెంట్ తో ఎన్ని రాజకీయాలు చేసినా జూబ్లిహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ఇదే జోష్ లో రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.


Comments