కైలాసగిరి కాలనీ ఎన్నికలు గందరగోళంలో

మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కైలాసగిరి కాలనీ ఎన్నికలు గందరగోళంలో

మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంమీర్పేట్ హౌసింగ్ బోర్డు నాలుగో డివిజన్‌ లోని కైలాసగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు వివాదా ల్లోకి చేరాయి. గత 16 సంవత్సరాలు గా అసోసియేషన్‌లో మహిళలకు పదవులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని పలువురు కాలనీవాసులు ఆరోపించారు.రిజిస్ట్రేషన్ నెంబర్ 91/2009తో రిజిస్టర్ అయిన అసోసియేషన్‌లో మహిళలను కేవలం సభ్యులుగా మాత్రమే తీసుకుంటున్నామని,“పదవులు మాత్రం ఇవ్వం… కొత్త సాంప్రదాయాలు వద్దు” అంటూ కొందరు బాధ్యులు మహిళలను ఎన్నికలు నుండి దూరం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం మహిళల పేర్లపైనే పట్టా భూములను జారీ చేస్తుండగా, కాలనీ అభివృద్ధి పనుల్లో మాత్రం మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని వారు పేర్కొన్నారు.గతంలో చాలామంది మహిళలు నామినేషన్ వేసేందుకు ముందుకొచ్చినా, వారి నామినేషన్లు స్వీకరించిన రికార్డులు లేవని మహిళలు ఆరోపిస్తున్నారు.“బస్తీల్లోనే మహిళలు పదవులు చేపట్టలేరని చెప్పి అణగదొక్కుతు న్నారు. అదే బస్తీల్లో ఇతర అసోసియేషన్లు మహిళలతో సేవలు అందిస్తున్నాయి. మరి కైలాసగిరిలో ఎందుకు కాదు?” అని మహిళలు ప్రశ్నించారు.“ఇదేమి రాజ్యం? దోపిడి రాజ్యమా?” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాతి నిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే, మరో కొత్త కాలనీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందని మహిళలు స్పష్టంగా హెచ్చరించారు.మహిళలను ఎన్నికల ప్రక్రియ నుండి దూరం చేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కైలాసగిరి కాలనీ ఎన్నికలపై ఈ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .