బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల వినతిపత్రం 

కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల వినతిపత్రం 

హనుమకొండ,నవంబర్14(తెలంగాణ ముచ్చట్లు):

బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ పూర్వ వరంగల్ జిల్లా ప్రతినిధులు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. విద్యా విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ పోరిక రమేష్‌కు మానసిక వేధింపులు జరిగాయని, దీనిపై నేషనల్ ట్రైబల్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రతినిధులు తెలిపారు.

సదరు ట్రిబ్యునల్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు తాఖీదులు జారీ చేసి, పదిహేను రోజుల్లో కమిటీ ఏర్పాటు చేసి నివేదికను పంపాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆక్షేపించారు. కమిటీ ఏర్పాటు చేసి నిజనిర్ధారణ జరిపి బాధితుడు డాక్టర్ పోరిక రమేష్‌కి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎన్ నాయక్, పోరిక శామ్యూల్ నాయక్, నునావత్ జవహర్లాల్ నాయక్, పోరిక జవహర్లాల్ నాయక్, వాంకుడోత్ వీరన్న, వాంకోడత్ అమృ నాయక్, భానోత్ అర్పిత, అనసూయ భూక్యా శ్రవణ్ కుమార్, భూక్యా సిద్దు నాయక్, ఈర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .