క్యాన్సర్ రోగికి ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఆర్థిక సాయం
అడ్డాకుల,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబునగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన 29 ఏళ్ల ముష్టి సాయిబాబాకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారించబడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి బాధితుడితో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడారు.
సాయిబాబా త్వరితగతిన మెరుగైన వైద్యం పొందేందుకు హైదరాబాదులోని ఎమ్ఐజీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన సహాయకంగా తన వంతుగా ₹10,000 ఆర్థిక సాయం అందించారు.
భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్న సాయిబాబా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. సహృదయులు ముందుకు వచ్చి సహాయం అందించాలని ఆయన కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోన్/ఫోన్‌పే/గూగుల్ పే నంబర్: 7989087488 ద్వారా అందజేయవచ్చు.


Comments