ఎ.ఎస్. రావు నగర్‌లో సీనియర్ సిటిజన్ వాక్‌థాన్ కార్యక్రమం ప్రారంభం
ఎ.ఎస్. రావు నగర్, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో ఎ.ఎస్. రావు నగర్ సీనియర్ సిటిజన్ హాల్‌లో సీనియర్ సిటిజన్ సభ్యుల కోసం నిర్వహించిన వాక్‌థాన్ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాధిక గుప్తా, జిల్లా సంక్షేమ అధికారి హాజరు కాగా, సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ
కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అధికారులు మాట్లాడుతూ—వయోవృద్ధుల ఆరోగ్యం, శారీరక దృఢత్వం పెంపొందించడానికి, అలాగే సామాజిక మరియు మానసిక శ్రేయస్సుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్‌ల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారిలో ఉత్సాహాన్ని నింపడమే వాక్‌థాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.తరువాత అధికారులు స్వయంగా వాక్‌థాన్‌లో పాల్గొని సీనియర్ సిటిజన్ సభ్యులను ప్రోత్సహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న సీనియర్ సిటిజన్‌లతో కార్యక్రమం సందడిగా, ఉత్సాహంగా సాగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులు, సభ్యులు, నిర్వాహకులందరికీ ఆయా సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments