పదోన్నతి పై బదిలీ అవుతున్న దేవదాసు కు ఘన సన్మానం.!

పదోన్నతి పై బదిలీ అవుతున్న దేవదాసు కు ఘన సన్మానం.!

సత్తుపల్లి, నవంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టణ పరిధిలోని జలగం వెంగళరావు సింగరేణి ఉపరితల గని కార్యాలయంలో సంక్షేమ (వెల్ఫేర్) అధికారిగా విధులు నిర్వహించి, కొత్తగూడెం సింగరేణి సూపర్ మార్కెట్‌కు మేనేజర్‌గా పదోన్నతి పొందిన దేవదాసు బుధవారం బదిలీ అవుతుండగా సింగరేణి సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు, సింగరేణి జే.వి.ఆర్. ఓ.సి లో అన్ని విభాగాల ఉద్యోగులను సంఘటితం చేసి, సంక్షేమ అధికారిగా ప్రతి ఒక్కరి సమస్యపై స్పందించిన ఏకైక అధికారి దేవదాసు అని పేర్కొన్నారు. ఉద్యోగులతో సౌహార్దంగా ప్రవర్తించిన తీరు, ఆయన మంచితనమే ఉన్నతాధికారులను మెప్పించి ఈ పదోన్నతిని అందించినదని అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో దేవదాసు మరెన్నో ఉన్నత హోదాలు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ & పిసి జూనియర్ ఇన్స్పెక్టర్, జమేధార్‌లు, సీనియర్ సెక్యూరిటీ గార్డ్స్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .