జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఎల్కతుర్తి లో సంబరాలు
ఎల్కతుర్తి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో, ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు.
ఎల్కతుర్తి అంబేద్కర్ కూడలి వద్ద కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరి బాణాసంచాలు కాల్చి విజయం సంబరాలు చేసుకున్నారు.
నవీన్ యాదవ్ గెలుపు కోసం తన శక్తి సామర్థ్యాలతో కృషి చేసి, చాలెంజ్‌గా తీసుకుని విజయాన్ని సాధించుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిరూపించుకున్నారని నాయకులు పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డగా ఆయన కృషిని నేతలు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి
AMC చైర్మన్ సుగినే సంతాజి, శీలం అనిల్ కుమార్,సీనియర్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ రమేష్ బాబు,శనిగరపు వెంకటేష్
సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు,మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్
పాక రమేష్, గొడిశాల నరేష్, గొర్రె మహేందర్,వీరమల్ల రంజిత్, బత్తిని రవీందర్ గౌడ్,జనగాని లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, సురేందర్,అంబాల శ్రీకాంత్, అంబాల జగన్, నవీన్, సాహూ
ఎల్కతుర్తి మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు.


Comments