మల్కాజిగిరి జిల్లా కోర్టులో జాతీయలోక్‌అదాలత్

కేసుల వేగవంత పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు సహాయకం : జస్టిస్ కె. లక్ష్మణ్

మల్కాజిగిరి జిల్లా కోర్టులో జాతీయలోక్‌అదాలత్

మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

న్యాయస్థానాల్లో కేసుల పెరుగుదల, న్యాయమూర్తుల కొరత కారణంగా కేసుల పరిష్కారం ఆల‌స్య‌మ‌వుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా ప్రవేశపెట్టిన లోక్‌అదాలత్‌లు ప్రజలకు శాశ్వత న్యాయం అందిస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు.శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్‌అదాలత్‌లు అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారాయని తెలిపారు. కక్షిదారుల విలువైన సమయం వృథా కాకుండా, వారి పరస్పర సమ్మతితో శాశ్వత పరిష్కారం చూపడమే లోక్‌అదాలత్‌ల ప్రధాన ఉద్దేశమన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్. శ్రీదేవి, జిల్లా కలెక్టర్ మనుచౌదరి, మల్కాజిగిరి డిసిపి పద్మజ, బాలానగర్ డిసిపి సురేష్, మల్కాజిగిరి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో చట్టం, న్యాయంపై అవగాహన లేని ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు, లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివాదాలను ఇరువైపులా నచ్చజెప్పి, ఎటువంటి జాప్యం లేకుండా పరిష్కారం చూపడంలో ఈ అదాలత్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారుIMG-20251115-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .