యువత స్వయం ఉపాధితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలి

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

యువత స్వయం ఉపాధితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలి

పెంద్దమందడి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు)..

యువత స్వయం ఉపాధితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి అన్నారు.యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి భవిష్యత్ మరింత బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

శనివారం పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో యువకులు దిండు ధర్మేందర్ మరియు శ్రీరాములు ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాల కోసం వెతుకుతూ, స్వయం ఉపాధి దిశగా ముందడుగు  వేసిన యువకులను ఆయన అభినందించారు.

స్వయం ఉపాధి ద్వారా తమకే కాకుండా గ్రామం, సమాజానికి ఉపాధి అవకాశాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలు, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యువత తమ జీవితాలను మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

 చేసే వృత్తిని దైవంగా భావించి కష్టపడి పనిచేస్తే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం  నుండి సహకారం అందుబాటులో ఉన్నదని, యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, వెంకటస్వామి, గ్రామ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, డిఎస్ మహేష్, దిండు రవీందర్, వడ్డే శేఖర్, సి వెంకటయ్య, మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20251115-WA0092

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!