ద్వారకాపురి కాలనీలో కార్తీక మాస దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న
సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
చర్లపల్లి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో ద్వారకాపురి కాలనీలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి హాజరై భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శ్రీకృష్ణుడు, పరమశివుడి అనుగ్రహం లభిస్తుందనే భావనతో ప్రతీ ఏటా కాలనీవాసులు దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగం, త్రిశూల ఆకారాల్లో దీపాలు వెలిగించి భక్తి భావంతో శ్రీకృష్ణుడు, పరమశివుడిని ఆరాధించారు.తరువాత చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షులు ఏంపల్లి పద్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు సంపూర్ణేశ్వరరావు కార్తీకమాసం ఆధ్యాత్మికతను విశదీకరించారు.ఈకార్యక్రమ ఏర్పాట్లలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ఎస్వి నాయుడు, వైస్ ప్రెసిడెంట్ చంద్రకళ, జనరల్ సెక్రటరీ సాయిరాం చురుకుగా పాల్గొన్నారు.
అసోసియేషన్ ప్రతినిధులు దేవేందర్, సుబ్బారావు, శ్రీధర్ గుప్తా, శ్రావణ్, నవిత, యాదగిరి, శ్రీరాములు, సోమనాథ్, గోపాల్, సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.



Comments