తిరుమలనగర్ కాలనీలో మిగిలిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తాం 

కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్

తిరుమలనగర్ కాలనీలో మిగిలిన అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తాం 

కాప్రా, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు)

మీర్పేట్ హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ కు వినతిపత్రం అందజేశారు.కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు  పూర్తయిన పనులు మినహా ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, “తిరుమలనగర్ కాలనీలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులు కొంతవరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపడతాం” అని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో సెక్రటరీ అమరేంద్ర బాబు, కోశాధికారి బీడీ దాస్, లీగల్ అడ్వైజర్ శ్రీను, కృష్ణమోహన్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .