మద్దిగట్ల–మోజర్ల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

- గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు

మద్దిగట్ల–మోజర్ల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

పెద్దమందడి,నవంబర్14(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం, మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..
పదో తరగతి విద్యార్థుల పూర్తి ఉత్తీర్ణత కోసం తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామని, వారికి అవసరమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల విద్యా పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

బాలల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన—
పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాలలంటే అపారమైన ప్రేమ. అందుకే ఆయన జయంతినే బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. అలీనామోదనం, పంచవర్ష ప్రణాళికలు, అక్షరాస్యత, మౌలిక వసతుల రూపకల్పన వంటి అంశాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు అని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిత్రాలతో కూడిన ప్రదర్శనను సందర్శించి, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.WhatsApp Image 2025-11-14 at 4.40.43 PM

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. రణధీవ్, పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణి ప్రభ, పుల్లయ్య, మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, కృష్ణవేణి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!