సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి

మల్కాజిగిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి డివిజన్‌కు చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మొత్తం రూ. 1,02,000 రూపాయల ఆర్థిక సాయం మంజూరయ్యింది.సహాయ నిధి కింద చెక్కులు పొందిన వారు:చుక్క మల్లేష్ రూ.60,000,మేహునిసా బేగం రూ .15,000,నందు కుమార్ రూ.27,000.సోమవారం బోయిన్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫిస్‌లో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తో కలిసి బాధితులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“సీఎం సంక్షేమ సహాయనిధి పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో వారికి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతోంది. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని అన్నారు.నిరుపేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, అనిల్ కిషోర్, కరంచంద్, జనార్ధన్, తులసి సురేష్, సంతోష్, బాలకృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .