చెకుముకి సంబరాలు ప్రారంభం.!
విశ్వశాంతి లో విద్యార్థులకు బహుమతులు.
సత్తుపల్లి, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో “చెకుముకి సంబరాలు” పేరిట ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 7న పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం నవంబర్ 21న మండల స్థాయి, నవంబర్ 28న జిల్లా స్థాయి, డిసెంబర్ 12 నుండి 14 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నట్లు ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి కంభంపాటి వెంకటేష్ తెలిపారు.
విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, ప్రావీణ్యతను పెంచడానికి, వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి, సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి, అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు సుమారు 6 లక్షలమంది ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు బహుమతులతో అభినందించారు.


Comments