రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు

 కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

 వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. యూనిట్ లో జరుగుతున్న పనుల పురోగతి మౌలిక వసతుల అభివృద్ధి విభాగల వారీగా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలపై ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు రైల్వే అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మార్చి నెల  ప్రారంభంతో తెలంగాణ ప్రజల 30 ఏళ్ల కల త్వరలో నెరవేరబోడుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలలోనే ఇది సాధ్యమైందని, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గతంలో అదే అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కోరానని ఆమె వెల్లడించారు. రైల్వే యూనిట్లో స్థానికుల ఉద్యోగాలు కల్పించే అంశంపై పార్లమెంట్లో సైతం తన గళం వినిపించానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మార్చి నెలలో ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి ఏడాది 600 ల కోచ్ లను ఇక్కడ సిద్ధం చేస్తారని ఆమె తెలిపారు. అభివృద్ధి పనులను జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు కావ్య సూచించారు. అనంతరం రైల్వే అధికారులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వివరాలను ఎంపీ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం ఆనంద్, మురళీకృష్ణ, డిజీఎం శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .