దేశ ఉజ్వల భవిష్యత్ కోసం బాలలు పాటుపడాలి

జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇప్ప శ్రీకాంత్

దేశ ఉజ్వల భవిష్యత్ కోసం బాలలు పాటుపడాలి

కాజీపేట్ నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు)
దేశం లోనీ బాల బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడాలని జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇప్ప శ్రీకాంత్ కోరారు. దేశ ప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా కాజీపేటలోని ఈ ఎల్ ఎస్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు 47వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అస్గర్ ఆధ్వర్యంలో రైల్వే ఈ ఎల్ ఎస్ కాలనీలో ఉన్న నెహ్రూ విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, సెంట్ ఫ్రాన్సిస్ అక్షర స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ నవీన్ రెడ్డి తో పాటు స్కూల్ విద్యార్థులు  పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇప్ప శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లల పట్ల నెహ్రూ ఎంతో ప్రేమ ఆప్యాయత  ఉన్నందున నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న దేశంలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొమురవెల్లి రమేష్, దువ్వరాజులు, నీలం భానుచందర్, వెంపటి నాగ మహేష్, గబ్బటి ఎల్లేష్, ఇమ్మడి రవి, మహమూద్, అలీముద్దీన్, క్రాంతి భరత్ , సిలివేరు మల్లికార్జున్ కుమార్, మహమూద్ తాజ్, సల్లూరి నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!