మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన రజిత పరమేశ్వర్ రెడ్డి

మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ విజయపురి కాలనీలో లావణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు లక్కీ డ్రాలో విజేతలైన మహిళలకు కుట్టు మిషన్లను ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేయడం, చిన్న వ్యాపారాలు చేసే మహిళా పారిశ్రామికవేత్తలకు వడ్డీలేని రుణాల కోసం ఉద్యోగిని పథకం వంటి అనేక కార్యక్రమాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి” అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభివృద్ధి సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.WhatsApp Image 2025-11-17 at 8.47.52 PMకార్యక్రమంలో లావణ్య ఫౌండేషన్ ఫౌండర్ లావణ్య, ఉప్పల్ ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు అమరేశ్వరి, టీచర్లు వాణి, మాధురి, సంధ్య, విజయపురి కాలనీ అధ్యక్షుడు లింగారెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, రాములు, బొడిగె మల్లేష్, అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .