వృద్ధాశ్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నాగారం, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి చౌరస్తాలో ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, దమ్మైగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప రామారావు పాల్గొన్నారు.వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి భోజన విందు ఏర్పాటు చేశారు.వృద్ధులతో మమేకమై నాయకులు ఆత్మీయంగా మాట్లాడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్మాన్‌భవ అనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ టీజేఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, దమ్మైగూడ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంజీవరెడ్డి, బాల్ రెడ్డి, గోవింద్ సింగ్, మాదిరెడ్డి రాజిరెడ్డి, దిలీప్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments