ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.

ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

హాసన్ పర్తి, నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):

విలీన గ్రామాల అభివృద్ధే ద్వేయంగా ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామ స్మశాన వాటికలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకోసం బుధవారం రోజున 18లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఎమ్మాల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్మశాన వాటికలు కూడా ప్రజా జీవనంలో ఒక ముఖ్యమైన భాగమని ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు, విద్యుత్, కూర్చునే సదుపాయం, షెడ్లు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రజల సమస్యలు విని పరిష్కరించడం నా బాధ్యత అని  అందరి ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానుని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .